నవతెలంగాణ మల్హర్ రావు: మండలంలోని వళ్లెంకుంట గ్రామంలో శనివారం అంబేద్కర్ యువజన సంఘం, అమృత వర్షిని అక్షర స్వచ్చంద సేవా సొసైటీ భూపాలపల్లి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 25 మందికి కంటి ఆపరేషన్లు అవసరమైనట్లుగా వైద్యులు సూచించారు.వారికి త్వరలో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్లమాప్తాల్ అసిస్టెంట్ దినేష్, కిషోర్,యువజన సంఘం సభ్యులు 20 మంది పాల్గొన్నారు.