నేడు రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత కంటి పరీక్షలు

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
టాప్రా ఆధ్వర్యంలో మ్యాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి కంటి ఆసుపత్రి వనస్థలిపురం హైదరాబాద్ వారిచే రిటైర్డ్ ఉద్యోగులకు నేడు యుటిఎఫ్ భవన్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టాప్రా  జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూకల జగదీష్ చంద్ర, పందిరి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు  పై ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ కు ఎంపిక చేయబడిన వారిని నల్లగొండ నుండి హైదరాబాద్ కు ఆసుపత్రి యాజమాన్యo వారే, వారి వాహనంలో ఉచితంగా తీసుకు వెళ్లి ఆపరేషన్ అయిన తర్వాత తిరిగి నల్లగొండకు చేరుస్తారని తెలిపారు. కావున విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులందరు హాజరై ఉచితంగా కంటి పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.