విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ మరియు ఆదర్శ పాఠశాల విద్యార్థులకు సోమవారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ సుజన్ కుమార్ తెలిపారు. కస్తూర్బా గాంధీ వసతి గృహంలో 174 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 14 మందికి దృష్టిలోపం ఉన్నందున కంటి అద్దాలు ఇవ్వడానికి సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు విద్యార్థినిలకు దృష్టిలోపం ఉన్నందున సరోజిని కంటి దవాఖాన కు సిఫారసు చేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు.  అదేవిధంగా ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా ఐదుగురు విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు హరి కిషన్, మనోజ్, నిక్కత్, హెచ్ ఈ వో  రామారావు తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.