ఉచిత కంటి వైద్య శిబిరం మండలంలోని పెద్ద పర్వతాపురం గ్రామంలో గల సాయిధామలో శనివారం రోటరీ క్లబ్ అఫ్ భువనగిరి సెంట్రల్, సుమంత్ కంటి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించారు.కంటి పరీక్షల శిబిరాన్ని సాయి ధామం ఆశ్రమం పీఠాధిపతులుశ్రీశ్రీశ్రీ స్వామీ శ్రీ రామానంద ప్రభుజీ, శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ ఇన్చార్జి మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ జి. చంద్రారెడ్డి, మాజి అధ్యక్షులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, కలిసి ప్రారంభించారు.శ్రీ సాయి విద్యాధామం హై స్కూల్ లో మొత్తం (75) విద్యార్థినీ విద్యార్థులు పరీక్షించగా.. (10) విద్యార్థిని విద్యార్థులకు కళ్ళజోళ్ళు అవసరం పడతాయని నిర్ధారించినైనది.ఇట్టి కళ్ళజోళ్ళు శ్రీ సద్ది వెంకట్ రెడ్డి, త్వరలో అందజేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమంత్ రెడ్డి, ఎస్పీఉపేందర్ రావ్, రోటరీ క్యాంపు కోఆర్డినేటర్, సుమంత్ కంటి ఆసుపత్రి సిబ్బంది కె.రాజేష్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఉన్నారు.