తాడ్వాయి మండలంలో ఉచిత చేప పిల్లల పంపిణీ 

Free fish fry distribution in Tadwai Mandalనవతెలంగాణ – తాడ్వాయి 
తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఆర్థిక చేతనందిస్తుందని ఐటిడిఏ పైసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ములుగు జిల్లా గిరిజన మత్స్య సంఘాల అధ్యక్షులు సిద్దబోయిన సురేందర్ లు  అన్నారు. అందులో భాగంగా బుధవారం మండలంలో లోని 96 చెరువులకు, 6 లక్షల 3 వేల 2 వందల 40 చేప పిల్లలు 11 గిరిజన మత్స్య సంఘాలకు, రవ్వ, బొచ్చ, బంగారు తీగ అనే మూడు రకాల చేప పిల్లలను ఉచితం గా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీవో సుమన వాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే  పథకాలను ఉపయోగించుకొని  గిరిజనులు ఆర్థికంగా బలపడాలన్నారు. ఈ కార్యక్రమం లో  రమేష్ ఎఫ్ ఎఫ్ ఓ, మత్స్య  శాఖ ములుగు జిల్లా పేసా కోఆర్డినేటర్  కొమురం ప్రభాకర్,   22 గ్రామాల మత్స్య  సంఘాల అధ్యక్షులు  బంగారి సాంబయ్య, చర్ప చంద్రశేఖర్, మల్లెల నాగేశ్వర్రావు, మల్లెల మనోహర్, అల్లెం సంజీవ్, వట్టం విశ్వనాధం,  13 గ్రామ పంచాయతీ ల కార్యదర్శులు, పేసా మొబిలైజర్లు  అల్లెం నవీన్, సిద్దబోయిన నర్సింగరావు, ఎల్లబోయిన నగేష్, తదితరులు పాల్గొన్నారు.