ఉచిత ఆరోగ్య శిబిరం..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ కార్మిక శాఖ సిఎస్ సి. హెల్త్ కేర్ ఆధ్వర్యంలో  సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి పి శరత్ బాబు తెలిపారు. ఆదివారం పంచాయతీ కార్యాలయంలో శరత్ బాబు మీడియాతో మాట్లాడుతూ లేబర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉన్న వారు తమ ఆధార్ కార్డులను తీసుకుని హెల్త్ క్యాంపుకు వచ్చి ఉచిత వైద్యాన్ని పొందవచ్చని సూచించారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని అన్నారు. అర్హులైన వారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం  సందీప్ డిస్ట్రిక్ట్ కో. ఆర్డినేటర్ 9573760003 సంప్రదించవచ్చని అన్నారు.