భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరం

– హెల్త్ కేర్ ను సద్వినియోగం పరుచుకోవాలి మేనేజర్ అంగోత్ ప్రవీణ్ నాయక్
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం నాడు సిఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఇతర నిర్మాణ రంగా కార్మికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ కేర్ మేనేజర్ అంగోత్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ పరీక్షల శిబిరాలను భవన నిర్మాణ కార్మికులు ఇతర రంగా నిర్మాణ కార్మికులు సద్వినియోగం పంచుకోవాలని కోరారు. హెల్త్ కేర్ ఉచిత ఆరోగ్య శిబిరంలో మద్నూర్ మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మారాడువార్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సంతోష్, వైద్యులు, వైద్య సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.