బస్తి దావఖానాలో ఉచిత ఆరోగ్య పరీక్షలు

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని  గోదాం గడ్డలోని బస్తీ దవఖాన లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక కార్డు(బి ఓ సి) లేబర్ కార్డు కలిగిన వారికి 75 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించే క్యాంపును ప్రారంభించామని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం బస్తి దావకాన ఉచిత క్యాంపులో ప్రారంభించి మాట్లాడుతూ  తెలంగాణ భవన, నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సి ఎస్ సి హెల్త కేర్  ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని లేబర్ కార్డు కలిగిన కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్  ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బొజు రమాదేవి రవిందర్ ,  మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఐలేని శంకర్ రెడ్డి,యండి అయూబ్ , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.