సంక్షేమ బోర్డు ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు

– నిర్మాణ కార్మికులు సద్వినియోగించుకోవాలి : సీఐటీయూ
నవతెలంగాణ-నల్లగొండ
భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా వెల్నెస్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ సీఎస్సీ హెల్త్‌ కేర్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య పరీక్షలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.సలీం, సీఎస్సీ హెల్త్‌ కేర్‌ డాక్టర్‌ తుల మోహన్‌ అన్నారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్‌లో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అదేశాలను అనుసరించి గౌరవ జిల్లా కలెక్టర్‌ నల్లగొండ ఆదేశాలమేరకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ హెల్త్‌ కేర్‌ వారి ఆధ్వర్యంలో 1320 పారమిటర్స్‌ పైగా,15 వేల రూపాయలు విలువ గల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, అన్నార్జ్‌ ,డాక్టర్‌ కన్సల్టెషన్‌ ఉన్నదని తెలిపారు. లేబర్‌ కార్డు కలిగి ఉన్నవారు నేటి వరకు పునరుద్దరణలో ఉండవలెనని తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ సంక్షేమ బోర్డు లేబర్‌ కార్డులు తీసుకోవాలని, కార్డులు ఉన్నవారు రెన్యువల్‌ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెల్త్‌ కేర్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు చిరుమర్తి శ్రీనివాస్‌, మక్కాపల్లి మధు, బండారు శంకరయ్య, భవన నిర్మాణ నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సలివోజు సైదాచారి, అద్దంకి నరసింహ, మండల కన్వీనర్‌ పోలీస్‌ సత్యనారాయణ, పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి భీమనపల్లి శంకర్‌, దాసరి నవీన్‌, నోముల యాదయ్య, మన్య శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.