నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సివిల్స్ కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నట్టు రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమి ప్రకటించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నామని రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమి ఫౌండర్, చీఫ్ మెంటార్ జి వివేకానంద, డైరెక్టర్ రమణ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు వసతి ఖర్చులు భారం కాకూడదనే సామాజిక బాధ్యతతో సేవలందిస్తున్నామని వివరించారు. శ్రీకాకతీయ ఎడ్యుకేషనల్ అకాడమి సహకారంతో 90 మంది అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9866074047 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.