వంద పడకల ఆసుపత్రిలో ఉచిత భోజనం

నవతెలంగాణ – మహాముత్తారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా నుండి మారుమూల గ్రామాల నుండి నిరుపేద పేషంట్ల బంధువులు భోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ఆ నిరుపేద వారి కోసం ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా ఆస్పటల్ సూపర్డెంట్ కోడూరి నవీన్  పాల్గొన్నారు. పేషంట్ల బంధువులు మాట్లాడుతూ ఇన్ని రోజులు మాకు అన్నం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని మా ఆకలి బాధ తెలుసుకొని జయశంకర్ ఫౌండేషన్ వారు మా కోసం ఉచిత భోజనం ప్రారంభించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరతి పోషన్న  ఫౌండేషన్ సలహాదారుడు చెన్నై మధు, జనరల్ సెక్రెటరీ పోశాల రాంబాబు, జాయింట్ సెక్రెటరీ  కొత్తపెళ్లి రాజు, యూత్ ఇంచార్జ్ చింతకింది రాజు, టేకుమట్ల ఇంచార్జ్ జెట్టి రమేష్, జిల్లా కన్వీనర్ బోనాల మధు, పిడుగు ఓదెల్,రెబల్ రాజేందర్,శమని నరేష్,జోడు రాజేందర్,తుమ్మ మహేష్,ఈశ్వర్, శివ,సాయి, తదితర సభ్యులు పాల్గొన్నారు.