పద్మనాయక కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం

Free medical camp at Padmanayaka Kalyana Mandapamనవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పద్మనాయక కల్యాణమండపం,వెలమ సంక్షేమ మండలి, మానేరు స్వచ్చంద సంస్థ ద్వారా హైదరాబాద్ యశోద హాస్పిటల్  వైద్యులు స్వచ్చందంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 2డీకే, బి. పి, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు ఆరోగ్య సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరం ను సెస్ చైర్మన్, జిల్లా వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు చిక్కాల రామారావు ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు ఉచితంగా అందించిన హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్య బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ రావు మాట్లాడుతూ వైద్యవృత్తి చాలా పవిత్రమైందని, ఉచితంగా వైద్య సేవలు అందించడం తో ప్రజల్లో వైద్యుల పట్ల అభిమానం పెరుగుతుందని ఆయన అన్నారు. యశోద హాస్పిటల్ యాజమాన్యం లాగే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, స్వచ్ఛంద సేవలు చేస్తే మనుగడ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.