సీఎస్సీ ఆధ్వర్యంలో సావర్ గావ్ లో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ –  జుక్కల్
మండలంలోని సావర్ గావ్ జీపీ పరిదిలోని గ్రామములో  గ్రామసర్పంచ్   కిషన్ పోవార్  అద్యక్షతన సీఎస్సీ ఆధ్వర్యంలో  సావర్ గావ్ , సావర్ గావ్ తాండా లో ఆదివారం నాడు ఉచిత వైద్యశిభిరం  నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామములోని ఆనారోగ్యంతో ఉన్న వారు,  వారితో పాటు గుంజెజబ్బులు, క్యాన్సర్, థైరాయిడ్, షుగర్, కొలెస్ట్రాల్ , మూత్రపరిక్షలు వంటివి యాబై రకాల వ్యాదులకు సంభందించిన వాటికి ఉచితంగా  వైద్య రక్త పరిక్షలు నిర్వ హించడం జర్గింది. ఎవైన సమస్యలు రక్త పరిక్షలో తీవ్రంగా ఉన్నాయని రిపోర్ట్  లో  తేలితే జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న అధునాతన ప్రభూత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయడం లో సీఎస్సీ సిబ్బంది సహకరిస్తారని వైద్యసిబ్బంది పేర్కోన్నారు. కార్యక్రమంలో   వైద్యసిబ్బంది,  ఆశా వర్కర్లు , గ్రామస్తులు  తదితరులు పాల్గోన్నారు.