కాచాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో సోమవారం హైదరాబాద్ పట్టణానికి చెందిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు.  ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీపీలు గాల్ రెడ్డి, సుదర్శన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.