పందిల్లలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో ఆదివారం విజయలక్ష్మి హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలు రకాల వైద్య సమస్యలతో వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తోడేటి రమేష్ మాట్లాడుతూ విజయలక్ష్మి హాస్పిటల్  లావాపేక్షతో కాకుండా వైద్యవృత్తిని గొప్పగా భావించి పేదలకు వైద్య సదుపాయాలు తక్కువ ఖర్చులో అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారన్నారు. పందిళ్ళ గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాలు వారు తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయ, ఉప సర్పంచ్ నెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబర్స్, బాలవికాస కోఆర్డినేటర్స్ జ్యోతి, నిర్మల పాల్గొన్నారు.