నేడు ఉచిత మెడికల్ క్యాంపు

నవతెలంగాణ – కంటేశ్వర్
మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ & తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సి ఐ ఆర్ సి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎస్ ఎస్ అండ్ టెక్నాలజీస్ వారి సహకారంతో నిర్వహించబడుతోంది అని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యదర్శి రామ్మోహన్ రావు ఆదివారం ప్రకటనలో తెలియజేశారు. ఈనెల జూన్ 26 (సోమవారం) ఉదయం 9 గంటల నుండి. స్థలం : నాందేవ్ వాడ (సీపీఎం ఆఫీసు దగ్గర), నిజామాబాద్ నందు నిర్వహించబడును అని తెలిపారు.షుగర్, బీపీ, క్యాన్సర్, మెమోగ్రఫి, ఈసీజీ, తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి వైద్యం అందించబడును అని తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి  ముఖ్య అతిథిగా డా॥ జయనీ నెహ్రూ, ట్రస్టు గౌరవాధ్యక్షులు, శాస్త్రుల దత్తాత్రేయరావు, ట్రస్టు అధ్యక్షులు, నూర్జహాన్, సి.ఐ.టి.యూ జిల్లా కార్యదర్శి, హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ లక్షణాలు గలవారు సంప్రదించగలరు అని తెలియజేశారు. గడ్డలు ( కంతులు) ఏర్పడడం (లేదా) శరీరంలోని ఏ భాగంలోనైనా (రొమ్ములలో) గడ్డలు కొత్త (పుట్టు) మచ్చలు (లేదా) ప్రస్తుతం ఉన్న అసలు (లేదా) మచ్చలలో మార్పులు చికిత్సకు మానని పుండు, గొంతులో గరగర, ఎప్పటికి ఉండే పొడి దగ్గు, మల, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు, విడవకుండా ఉంటున్న అజీర్తి మింగడంలో ఇబ్బంది, బరువులో అర్థం కాని మార్పులు (హెచ్చు తగ్గులు), అసాధారణ రక్తస్రావం (లేదా) ద్రవాలు స్రవించడం. వదలకుండా వచ్చే తలనొప్పులు, వాంతి వచ్చేలా ఉండటం, వాంతులు రావడం, నీరసం లేదా పదే, పదే ఇన్ఫెక్షన్లు కావడం మరియు రెండు వారాలకు పైగా జ్వరం ఉంటే, వైద్యుడిని సందర్శించే సమయమైందని గమనించండి.