దివిస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ- వలిగొండ రూరల్

మండల పరిధిలోని  గోల్నే పల్లి జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, నెమలి కాల్వలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దివిస్ లెబరోటరీస్ వారి  సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పాదరక్షలు నెమలి కాల్వ సర్పంచ్ వంగాల బిక్షపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణ ప్రసాద్, దివిస్ సి ఎస్ ఆర్ ఇన్చార్జ్ వల్లూరి వెంకటరాజు, సాయి కష్ణ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.