భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్, చావా ఫౌండేషన్లు సంయుక్తంగా తుర్కపల్లి మండలంలోని పెద్ద తండాలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కె హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పల్లె పల్లెకు వైద్యం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్ కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 199 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఎముకలకు సంబంధించి బిఎండి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బాబు, ఆర్కే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.