
– మెడీకవర్ ఆస్పత్రి ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన
నవతెలంగాణ-బెజ్జంకి
ఉచిత వైద్య శిభిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గోప్ప వరం లాంటివని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జెల్లా ఐలయ్య అన్నారు.శనివారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో బాల వికాస అధ్వర్యంలో కరీంనగర్ మెడీకవర్ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిభిరాన్ని సర్పంచ్ ఐలయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 500 మంది రోగులకు ఉచిత బీపీ, మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.మెడీకవర్ ఆస్పత్రి వైద్య బృందం, గ్రామస్తులు హజరయ్యారు.