రూరల్ డెవలప్మెంట్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

నవతెలంగాణ-గోవిందరావుపేట
రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మండలంలోని ఇప్పలగడ్డ సోమలగడ్డ పసర గ్రామాలలో శనివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. డాక్టర్ రమేష్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు 96 మంది రోగులకు బిపి షుగర్ రక్తహీనత మలేరియా వైరల్ ఫీవర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
అనంతరం డాక్టర్ రమేష్ ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకొనవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రత పాటించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ లక్ష్మి, హెచ్ ఓ తిరుమల, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.