డోన్ గాం సిఎస్సీ ఆధ్వర్యంలో గ్రామప్రజలకు ఉచిత వైద్య పరిక్షలు

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని డోన్ గాం గ్రామ పంచాయతి పరిదిలోని గ్రామాలలో గ్రామసర్పంచ్ గజిరే కళావతి అద్యక్షతన సిఎస్సీ అధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్యపరిక్షలు నిర్వహించడం జర్గిందని గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ వాయకుడు గజిరే రాజు తెలిపారు. ఈ సంధర్భంగా నాయకుడు రాజు మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు యాబై రకాల వ్యాదులకు సంభందించిన ఉచితంగ క్యాన్సర్, థైరాయిడ్, కలెస్ట్రాల్ వంటి వైద్య పరిక్షలు చేయించుకునెందుక మంచి అవకాశంగా భావించి గ్రామీణ ప్రాంత మారుమూల సరిహద్దు గ్రామాల ప్రజలు వారు సద్వీనియేాగం చేసుకోవాలని పేర్కోన్నారు. వైద్య పరిక్షలకు గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చిందని నాయకుడు రాజు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ యువకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.