
కార్మిక శాఖ మరియు సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మండలంలోని నందిగాం గ్రామంలో భవన మరియు నిర్మాణరంగా కార్మికులకు సోమవారం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమార్తం 16 రకాల వైద్య పరీక్షలను సుమారు వందకు పైగా కార్మికులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య కిషన్ రావు, ఎంపీటీసీ లలితా, సంజీవ్, కారడి విజయ్, గొల్ల సాయిలు, రమేష్, మహేష్, నాగారావు, సిఎస్సి హెల్త్ కేర్ సభ్యులు చందు, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.