
పివిఆర్ స్టోర్ ఫార్మసీ, క్లినిక్ వారి పద్మ సాయి డెంటల్ ఆధ్వర్యంలో సోమవారం చీకటిమామిడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో వందమందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో 40 మందికి ఉచిత మూత్ర పరీక్షలు 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కొరకు పరీక్షలు నిర్వహించారు. ప్లావట్ ఆప్టికల్స్,హిమర్ జాప్ లయన్స్ క్లబ్ కాప్రా వారి ఉచిత వైద్య పరీక్షలు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్, అనిల్, విజయ్ కుమార్, శ్రీదేవి, తదితర డాక్టర్లు పాల్గొన్నారు.