ఉచిత వైద్య మెగా శిబిరం ..

Free Medical Mega Camp..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, రైన్ ద స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ వారి  సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఇస్లాం పుర కొజ్జా కాలనీలో ప్రైమ్ ది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్  పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కాలనీ వాసులకు ఉచిత వైద్య మెగా శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఐఎంఏ అధ్యక్షులు  డా. దామోదర్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహా భాగ్యం అని, ప్రజలు ఆరోగ్యం భాగుండాలంటె,  డెంగ్యూ, మలేరియా వ్యాధుల రాకుండా ఉండాలంటే పరిసరాల  పరి శుభ్రత అవసరంమన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సూఫీ సజ్జదనషిన్ కౌన్సిల్ నిజామాబాద్ చైర్మన్ ఎండి అబ్దుల్ ఖాన్, పాఠశాల ప్రిన్సిపల్ డా. అబ్దుల్ ముడస్సిర్, ఎండి రుమాన్,వివిద రకాల నిపుణులైన వైద్యులు  ఐఎంఏ అధ్యక్షులు డా. దామోదర్ రావు,  డా. రవీంద్రనాథ్ సూరి, డా. కౌలయ్య, డా. ఖాజా మౌనొద్దిన్, డా. లుబనా నౌశీణ్, డా. అలెక్యా, డా. చిదుర నవీన్, డా. లుగ్మాన్,   పాల్గొని  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపణి చెసారు, 200 మంది మెగాహెల్త్ ‌క్యాంపు లో పాల్గొన్నారు.