మినీ మేడారం జాతరకు ఉచిత వైద్య సేవలు ..

Free medical services for Mini Medaram fair..– జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు
– మేడారాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి 
నవతెలంగాణ – తాడ్వాయి 
వచ్చే నెల ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరుగు మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరోగ్య సేవల గురించి హెల్త్ క్యాంప్ నిర్వహించి విస్తృతంగా ఉచిత వైద్య సేవలు అదేవిధంగా కృషి చేస్తామని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాల్ రావు అన్నారు. గురువారం మేడారం వనదేవతలను దర్శించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు మేడారంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ మినీ మేడం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దళిత కుండా వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు టీబీ నియంత్రణ అధికారి డాక్టర్. చంద్రకాంత్, ఇన్చార్జి డెమో సంపత్, డి ఈ ఓ కిరణ్ , హెల్త్ అసిస్టెంట్ చేల తిరుపతయ్య, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.