ఐఎంఏ ఆధ్వర్యంలో మద్దికుంటలో ఉచిత వైద్య సేవలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలను గ్రామ సర్పంచ్ బొమ్మిడి రాంరెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు వైద్యులు వెంకటేశ్వర గౌడ్, సెక్రటరీ వైద్యుడు నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ…. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఆదేశానుసారం, ” ఆవు గావ్ చలో ” కార్యక్రమాన్ని చేపట్టామని, కామారెడ్డి ప్రాంతంలోని మద్దికుంట గ్రామాన్ని దత్తత తీసుకొని, ఉచిత వైద్య సేవలు, ఉచిత మందులు అందజేస్తున్నామని, కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రముఖ ఆస్పత్రుల్లోని వివిధ స్పెషలిస్టులకు సంబంధించిన వైద్యులు ఉచిత వైద్యం అందిస్తున్నారని, ప్రతి నెలలో ఒక ఆదివారం రోజు వైద్య సేవలు అందిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ…. ఐఎంఏ నుండి వైద్య సేవలు అందించడానికి మద్దికుంట గ్రామాన్ని దత్తత తీసుకొని, ఉచిత వైద్యం, మందులు అందజేస్తున్నందుకు గ్రామ ప్రజల తరఫున ఐఎంఏ వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యుల బృందం, ల్యాబ్ టెక్నీషియన్, ఉప సర్పంచ్ నరేందర్, వీడీసీ చైర్మన్ గజ్జల శంకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.