మేడారంలో విస్తృతంగా ఉచిత వైద్య సేవలు 

– డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కోరం క్రాంతి కుమార్ 
నవతెలంగాణ -తాడ్వాయి 
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించడానికి కల్యాణ మండపంలో వైద్యులు నిరంతర వైద్య సేవలందిస్తున్నారు. శుక్రవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కోరం క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది లు మెరుగైన వైద్య సేవలు అందించారు.
జ్వరం పీడితులకు, డయేరియా, డిహైడ్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రోగులకు వైద్య సేవల నుంచి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కోరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ మంత్రి, జిల్లా కలెక్టర్, డి ఎ అండ్ హెచ్ ఓ  ల ఆదేశాల మేరకు మినీ జాతరకు ముందస్తుగానే ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వారికి పరీక్షించి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. క్రానిక్ సమస్యలు ఏమైనా ఉంటే 108 ద్వారా జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలపై ఎలాంటి సమస్యలు లేకుండా మినీ జాతరలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.