
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామం లో మంగళవారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిభిరం ఏర్పాటు చేశారు.ఈ పశు వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ దాసరి సైదమ్మ నాగయ్య,మండలం పశు వైద్యాది కారులు పిట్టల చంద్రబాబు, సాయి కార్తిక్ లు ప్రారంభిచారు.ఈ శిబిరంలో 100 పశువులకు,గర్భకోశవ్యాధులకు,నట్టల నివారణకు 150 దూడలకు, రైతులకు లింగ నిర్ధారిత ఉపయోగాలపై అవగాహన చేయనైనది.పాడి పశువులకు పశుగ్రాస ఆవశ్యకత మీద రైతులకు వివరించారు.