మండలంలోని చందుపట్ల గ్రామంలో భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్ , చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 111వ ఉచిత మెగా వైద్య శిబిరం స్వర్గీయ చిదరకంటి మైసయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధిరాములు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం నందు శ్రీ ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చావా రాజ్ కుమార్ గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు వాటికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు , డెంగ్యూ విష జ్వరాలు నియంత్రణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామ ప్రజలకు వివరించారు. పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం నందు 200 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సిద్ధిరాములు , టిఎస్పిఎస్ చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ చిన్నం పాండు, మాజీ ఎంపిటిసి బొక్క కొండల రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.