నవతెలంగాణ – పటాన్ చెరు
నేడు (ఆదివారం) పట్టణంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మంజీరా విజ్ఞాన కేంద్రం, అమేధా హాస్పిటల్స్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అమేధా హాస్పిటల్స్ సౌజన్యంతో మంజీర విజ్ఞాన కేంద్రం, సిఐటియు నిర్వహణలో శ్రామిక్ భవన్ లో ఉచిత మెగా వైద్య శిబిరం ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ వైద్య శిబిరంలో 10 రకాల జబ్బులతో పాటు వివిధ రకాల టెస్టులు, అవసరమైన వారికి ఉచితంగా మందులు సైతం అందజేయున్నట్లు తెలిపారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు సీఐ ప్రవీణ్ రెడ్డి, అమేధ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు వస్తున్నట్లు పటాన్ చెరు పట్టణ, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు