భువనగిరి మండలంలోని జమ్మాపురం గ్రామంలో శ్రీ ఆర్ కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 114 ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ పల్లె పల్లకి వైద్యం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు షుగర్, బీపీ, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు మందులను డాక్టర్ సలహా మేరకు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వయంగా ముందుకు వచ్చి తమ గ్రామం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన జోజప్పని ఈ సందర్భంగా డాక్టర్ ని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు యాదాద్రి భువనగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ , మాజీ సర్పంచ్ పసల జ్యోతి , స్క్రీన్ ఎన్జీవో ఆరోగ్యయ్యా, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుధాకర్ , మహిళా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షురాలు ప్రసన్న , గ్రామ పెద్దలు లుర్దయ, స్వరూప రాణి లు పాల్గొన్నారు.