నవతెలంగాణ – పాల్వంచ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ వారు నిర్వహిస్తున్న ‘ఉచిత మాక్ టెస్ట్’ లను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఈ మాక్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, హైదరాబాద్ లోగల స్థానికులకు మైనారిటీ స్టడీ సెంటర్ హైదరాబాద్ లో ఆఫ్లైన్ ద్వారా ఈ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ లోపు తమ జిల్లాలో గల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాల్లో తమ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబరును అందించి ఆన్లైన్ లింక్ పొందాలని తెలిపారు. ఆగస్టు 1 మరియు 2 వ తేదీలల్లో మాక్ టెస్ట్ లు నిర్వహిస్తారని, ఇట్టి అవకాశాన్ని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గూగుల్ ఫారం, స్కానర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని, ఇతర వివరాలకు 8520860785 కు సంప్రదించాలని పేర్కొన్నారు.