ఓటు హక్కును వినియోగించుకుంటే ఉచిత ఓపి : డా. శ్రావణ్ కుమార్ 

నవతెలంగాణ – మిరుదొడ్డి 
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దాసరి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి తమ ఆసుపత్రిలో ఈ నేల 13 నుండి 20 వరకు ఉచితంగా ఓపి చూడబడునని సిద్దిపేట పట్టణంలోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు  చెందిన డాక్టర్ దాసరి శ్రావణ్ కుమార్  తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యన్ని కాపాడాలనే  సంకల్పంతోనే తన వంతు కృషి గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.