ఉచిత రెబీస్ వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ – ఏర్గట్ల
ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 వ తేదీ శనివారం రోజున మండల పశువైద్యశాలలో  పెంపుడు శునకాలకు ఉచిత  రెబీస్ వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని, మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని యజమానులు ఉపయోగించుకోవాలని కోరారు.