నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ వారు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వార క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ లు అందివ్వనున్నామని జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికా కృష్ణవేణి సోమవారం ప్రకటనలో తెలిపారు. కావున తేది 04.01.2025 నుండి తేది 20.01.2025 న సాయంత్రం 5.00 గం. ల వరకు క్రిస్టియన్ మైనారిటీ మహిళలు ఆన్లైన్ TGOBMMS web: tgobmms.cgg.gov.in ద్వార దరఖాస్తు చేసుకోగలరని తెలియజేశారు.