బయ్యక్కపేట్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం

– ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరండి
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని బయ్యక్కపేట్ ప్రభుత్వ యుపిఎస్ ఆశ్రమ పాఠశాలలో మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు  తైకాండ్ కరాటే మాస్టర్ చందా హనుమంతరావు తెలిపారు. విద్యార్థులకు కరాటే, యోగ కబడ్డీ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, సాయంత్రం 5.00 గంటల నుండి 6:30 వరకు కొనసాగుతుందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో జాయిన్ కావాలని తెలిపారు.