న్యూఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వీలుగా మరిన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారత అధికారులు ఫిబ్రవరి 21-24 తేదిల్లో లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ ప్రతినిధి బృందానికి వాణిజ్య సెక్రటరీ సునీల్ కుమార్ బర్వాల్ నాయకత్వం వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఎఫ్‌టీఏకు సంబంధించి ఎప్పటి నుంచో అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని.. ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే దీనిపై ఓ స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.