నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహిళల ఆర్థిక అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల పనులపై 45 రోజుల ఉచిత శిక్షణ చేపడుతున్నామని బైరెడ్డి డైరెక్టర్ పి రామారావు అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్ లో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ క్షేత్ర కార్యాలయంలో బైరాడు సహకారంతో ఏర్పాటుచేసిన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ మైదా 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బైరెడ్డి డైరెక్టర్ పి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వశక్తి మహిళలు కుట్లు అల్లికలు మగ్గం వర్క్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన శిక్షణ కార్యక్రమాల ద్వారా అధిక అభివృద్ధి చెందాలని కోరారు. 45 రోజుల ఉచిత శిక్షణ తోపాటు మధ్యాహ్న భోజనం, సర్టిఫికెట్స్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కావాల్సిన శిక్షణ కార్యక్రమం రా మెటీరియల్ ఉచితంగా అందజేయబడుతుందన్నారు. ఉదయం 9 30 నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. బైరాడు మరియు జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 50 మంది శివశక్తి మహిళల అప్లికేషన్ లు వచ్చాయన్నారు. మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనవికాస ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెసరి రాజు, ట్రైనింగ్ కోఆర్డినేటర్ గందే మనిషా, ఫిషరీ సెక్యూర్, సీఈవో సంతోష్ రెడ్డి, న్యాయవాది రాజమౌళి, ట్రైనర్ విమల మహిళలు పాల్గొన్నారు.