జూట్ బ్యాగులపై ఉచిత శిక్షణ 

నవతెలంగాణ- సిద్దిపేట: మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం తో శాస్త్రిత్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్ పై ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పోగ్రామ్ డైరెక్టర్  డాక్టర్ గడ్డం సుదర్శన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో నాలుగు వారాల శిక్షణ ఉంటుందని,  డిసెంబర్ 4 నుండి ప్రారంభమవుతుందనీ తెలిపారు.  జూట్ లంచ్ బ్యాగ్, జూట్ పర్స్, జూట్ ఫైల్స్, జూట్ ఫోల్డర్లు, జూట్ లగేజ్ బ్యాగ్, జూట్ ల్యాప్టాప్ బ్యాగ్, మరో 10 రకాలు ఈ ప్రోగ్రామ్లో నేర్పిస్తారనీ,  కార్యక్రమం పూర్తయిన తర్వాత  సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూట్ వ్యాపారం ఎలా ప్రారంభించాలో కూడా  బోధిస్తామనీ, బ్యాంకు రుణం పొందడానికి రిజిస్ట్రేషన్, నమూనా ప్రాజెక్ట్ నివేదిక మార్గదర్శకత్వం చేయబడుతుందనీ తెలిపారు.  మరింత సమాచారం కోసం  8978649108 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.