ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈబీసీ డిగ్రీ పాసైన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్.ఆర్.బి., ఎస్.ఎస్.సి అండ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ జిల్లా అభివృద్ధి అధికారి రాజలింగు, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుండి ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణ 15 నుండి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. నాలుగు నెలల ఉచిత శిక్షణ ఉంటుందని, అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ www.tgbcstudycircle.cgg.gov.in” ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఇస్తామని. పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు ఉండాలని, అభ్యర్ధుల ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 08732-221280 నంబర్ సంప్రదించాలని సూచించారు.