ఉచిత ప్రయాణం-ప్రేలాపనలు!

ఉచిత ప్రయాణం-ప్రేలాపనలు!‘టీఎస్‌ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టడం బాగుంది. మేం ఒత్తిడులకు గురయ్యామనడం అవాస్తవం. ఉద్యోగమన్నాక, ఎక్కువమంది ప్రయాణికులు ఎక్కి నప్పుడు గట్టిగట్టిగా అరవాల్సి వస్తుంది. మహిళలు ఆధార్‌ కార్డు చూపిస్తున్నారు. దాని ప్రకారం టికెట్టు కొడుతున్నాం. ఒరిజినల్‌ ఆధార్‌కార్డు లేకుంటే చార్జ్‌ వసూలు చేస్తున్నం. ఇవన్నీ మాకు మామూలే. ఉచిత ప్రయాణం లేని సమయం లోనూ ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. చూసేవా రికి, విన్న వారికి ఇలాంటివి కొత్తగా ఉండొచ్చు. జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు గొడవలు గాకుండా ఉంటాయా? చెప్పం డి’… అని కండక్టర్లు చెబుతున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో అమలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో విభిన్న కథనాలు వస్తున్నాయి. ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారని, టాప్‌ ఎక్కి ప్రమాదకరంగా ప్ర యాణిస్తున్నారని ట్రోల్‌ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడో చోట జరిగిన సంఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు తున్నాయి. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజెప్పడం కోసం కొంతమంది గ్రూప్‌లలో పెడుతుండవచ్చు. దీన్నో భూ తద్దంలో చూపెడుతూ ఉచిత ప్రయాణాన్ని తక్కువ చేసేం దుకు కొంతమంది ప్రయత్నించడం మంచిదా? ఈ విషయమై కొంతమంది ఆర్టీసీ కండక్టర్లను, డ్రైవర్లను, తోటి ప్రయాణికు లతో ముచ్చటించాను. ”ఉచిత ప్రయాణం బాగుంది. ప్రభు త్వం నిర్ణయం హర్షించదగినది. పేద, మధ్య తరగతికి చెందిన ఎక్కువమంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఏదో ప్రత్యేకంగా కొన్ని బస్సులను కేటాయిస్తారని అనుకున్నాం. ఇలా అన్ని బస్సులలో కల్పిస్తారని మహిళలందరికీ పెడతారని ఊ హించలేదు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, సాధారణ ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుకునే అమ్మాయిలకూ బాగుంది..” అని అంటున్నారు మహిళలు. ”ఎక్కడోచోట జరిగిన వాటిని మీడి యాలో అతిగా చూపిస్తున్నారు. ఇది ఆడవారిని తక్కువ చేయ డమే. దీనిని నవ్వులపాలు చేయకండి. అదే మా విన్నపం.” అని మహిళలు కోరుతున్నారు. ‘బస్సు దిగి కిలోమీటర్‌ లోపలికి వెళ్లాలంటే.. ఆటో ఎక్కాల్సిందే ‘ అని మరికొంతమంది మహిళా ప్రయాణికులు అంటున్నారు.
మహాలక్ష్మి పథకం ప్రారంభించి నేటికి నెలరోజులైంది. ఈ నెలరోజుల్లో ఇబ్బందులున్న మాట వాస్తవం. అదనపు బస్సులు నడపాలని, బస్సులేని గ్రామాలకూ బస్సు సౌకర్యం కల్పించా లని డిమాండ్లు ఉన్నాయి. కాని పథకమే సరికాదు అని కొంత మంది వైరల్‌ చేయడమే విచిత్రంగా ఉంది. ఈ పథకం లేన ప్పుడు ప్రమాదకరంగా ప్రయాణించిన సందర్భాలు లేవా? జనంతో కిక్కిరిసిన బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ ఇలాంటి దృశ్యాలు ఉండేవి. పుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గు రైనవారూ ఉన్నారు. పండుగలు, ఇతర శుభకార్యాల సమయా ల్లో తప్ప ఆర్టీసీకి ఆదాయం వచ్చేది కాదు. ఇప్పుడు ప్రయాణీ కులు ఆర్టీసీ బస్పును బాగా ఉపయోగించుకుంటున్నారని ఆర్టీ సీ సంస్థనే వివరాలతో సహా వెల్లడించింది. బస్సుల కోసమే మహిళలు గంటల తరబడి వెయిట్‌ చేస్తున్నారనేది తప్పు.. ఆటోలు కూడా ఎక్కి వెళ్తున్నారు. కొన్నిచోట్ల జరిగిన వాటిని అంతటా ఆపాదించడం సరికాదు. గతంకంటే ఇప్పుడు రోజూ వారి ఆదాయం కొంత తగ్గిందని ఆటోవాలాలు చెబుతున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. దానికి సంబంధించి వారి కోసం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలి.
ఉచిత రవాణా కల్పించడం ఒక్క తెలంగాణలోనే కాదు. దేశంలోని కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ ఉంది. కాక పోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాదిరిగా అమలవుతుంది. తెలం గాణలో రాష్ట్రమంతటా మహిళలకు వర్తింపజేసింది ప్రభుత్వం. ఈ ఉచిత రవాణా ప్రపంచంలోని లక్సెంబర్గ్‌ దేశంలో అక్కడ ప్రభుత్వం 29 ఫిబ్రవరి 2020న అమలు చేసింది. బస్సులు, రైల్వేల్లోనూ ప్రజలకు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మాల్టా దేశం లోనూ 2022 అక్టోబర్‌ 1 ప్రారంభించింది. మరికొన్ని దేశాలకు సంబంధించి ముఖ్యమైన పట్టణాల్లోనూ ఉచిత రవాణా సదు పాయాన్ని అక్కడ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దానిని అక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.న్యూఢిల్లీలో మహిళ లకు ఈ పథకం బాగా ఉపయోగపడిందని అక్కడికి వెళ్లి వచ్ని న వారు చెబుతున్నారు. కర్నాటకలో ప్రవేశపెట్టినప్పుడు మహి ళలను తప్పుగా చూపిస్తూ బీజేపీ హేళన చేసింది. తెలంగాణ లోనూ ఇలాంటి వాటినే హైలెట్‌ చేస్తూ చూపిస్తున్నారు. లక్ష లాది ప్రజలకు సంబంధించి రోజూ ఉపయోగించుకునే పథ కంలో సమస్యలు ఉండటం సహజం. సమస్య ఉన్నప్పుడు అవ సరమైన బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సమ స్యలు లేకుండా చేయాల్సింది ప్రభుత్వమే. కేంద్రప్రభుత్వం పారిశ్రా మిక వేత్తలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసింది. ఉచితం అవసరమా? అని ప్రశ్నిస్తున్న బీజేపీ నే తలు.. పారిశ్రామిక వేత్తల రుణాల రద్దుపై ఎందుకు ప్రశ్నించ డం లేదు. విగ్రహాల నిర్మాణానికి, గుడుల కోసం కోట్ల రూపా యలను మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
బీజేపీయేతర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే పథ కాలు ప్రవేశపెడ్తుంటే.. ఉచితంగా ఇవ్వడం కరెక్టు కాదంటారు. వాస్తవానికి ఉచిత రవాణా పథకం మహిళలకు ఉపయోగ ప డిందా లేదా అన్నది ప్రశ్న. మహిళలు పథకాన్ని ఉపయోగించు కుంటున్నారన్నది వాస్తవం. ఇదే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ప్రస్తావించినప్పుడు.. సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్క రిస్తాం.. పథకం మహిళలకు లబ్ది చేకూరిందా లేదా అన్న వరకే చూస్తున్నామని స్పష్టం చేశారు. ఒకదానివల్ల మరొకరు నష్ట పోవాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. ఆర్టీసీకి ఆదాయం ఎలా సమకూరుతుంది? ఆదాయమార్గాలేంటి? ఏ రకంగా సంస్థను బతికిస్తారు?.. వంటివి ప్రభుత్వం చూడగలదా లేదా భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
– జీవిఎం, 9490099023