పశు గణన అభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

– ఉచిత పశు వైద్య శిబిరాలు పశువుల దారులకు ఉపయోగకరం అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్

నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండలంలోని హెచ్ కేలూరు గ్రామంలో గురువారం నాడు పశువు గణన అభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పశు గణన అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మజీద్ మాట్లాడుతూ పశువుల దారుల కోసం ఉచితంగా నిర్వహించే పశు వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ పశు వైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధి చికిత్సలు 62 దూడలకు నట్టల నివారణ 38 సాధారణ చికిత్సలు 36 నిర్వహించినట్లు పశు వైద్య శిబిరంలో మేనూరు పశువైద్య డాక్టర్ బండి వార్ విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మద్నూర్ పశువైద్య అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఆ గ్రామ సర్పంచ్ నీలావతి హనుమాన్లు ఉపసర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు విజయ్ పశువుల దారులు పశు వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.