– మంత్రి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
– హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఎందరో త్యాగదనుల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలతో 78 సంవత్సరాలుగా ఫలాలను అనుభవిస్తున్నామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ, గౌరవెల్లి ప్రాజెక్టు 98 శాతం పనులు బి ఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తిచేశామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగతా పనులు పూర్తిచేసి రైతులకు సాగులో అందించాలన్నారు. ప్రాజెక్ లో నీళ్ళు తీసుకువచ్చి రైతులకు సకాలంలో అందిస్తే రైతులు సంతోషపడతారన్నారు. ప్రజలందరూ రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, వాళ్ల సుప్రజ నవీన్, ఐలేని శంకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్ధాల చంద్రయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్వర్, మాజీ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట మాజీ జెడ్పిటిసి భూక్యమంగా, అక్కన పేట మాజీ ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిలునాయక్ తదితరులు పాల్గొన్నారు.