వాక్‌ స్వాతంత్య్రమే శాస్త్రవేత్తలకు ప్రాణవాయువు

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంపై చర్చను నిషేధిస్తూ, ఇండియన్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ,పరిపాలనా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ 500 మందికి పైగా శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు గతవారం లేఖ రాశారు. దానికి ప్రతిస్పందనగా, వేరే పరిశోధనా సంస్థ డైరెక్టర్‌, ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, విద్యా, పరిశోధనా విభాగం, పంజాబ్‌ లోని మొహాలీలోని, ఎడ్యుకేషన్‌ అండ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు లేఖ రాసిన, తన సంస్థలోని ఇద్దరు అధ్యాపక సభ్యులకు సంజాయిషీ నోటీసులు అందజేశారు.
ఆ లేఖపై సంతకం చేసిన వ్యక్తిగా, ఈ రచయిత ఐఐయస్‌ సి, ఐఐయస్‌ఇఆర్‌ లాంటి అధికార విభాగాలవలె, వాటిని మూసి వేయటానికి ప్రయత్నించే బదులు, సామాజిక, రాజకీయ చర్చలను ప్రోత్సహించటం, శాస్త్రీయ పరిశోధనా సంస్థలకు ఎంత ముఖ్యమో వివరించాలనుకున్నాడు.
శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, విస్తృత సమాజంలో భాగమే కాబట్టి, వారి సభ్యులకు కూడా, ఇతరుల లాగానే, సామాజిక చర్చల్లో పాల్గొనే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటుంది. అటువంటి సంస్థలలోని పరిశోధకులకు వివిధ విషయాలపై క్లిష్టమైన పరిశోధనలు నిర్వహించడానికి తగిన విశ్రాంతి, శిక్షణ సమకూర్చుబడుతుంది. ఈ సంస్థలకు లభించే ప్రచార మద్దతుపై ఆధారపడే, ఈ ప్రత్యేక అధికారం అంటే, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం, తమను తాము వ్యక్తపరచుకోవడం వంటివి వారికి అదనపు తబాధ్యతగా ఉంటాయి. ముఖ్యంగా, అత్యంత తీవ్రమైన సామాజిక కల్లోలం నెలకొనివున్న ప్రస్తుత పరిస్థితులలో, శాస్త్రీయ పరిశోధకులు న్యాయం కోసం నిలబడడంలో విఫలమైనట్లయితే, ఈ బాధ్యత నుండి వారు వైదొలిగినట్లే అవుతుంది.
శాస్త్రవేత్తలు తమకు తాము సైన్స్‌కే పరిమితం కావాలని, సామాజిక ప్రశ్నలకు దూరంగా ఉండాలని, సంకుచిత దృక్పధంతో చూచించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, సైన్స్‌గా పరిగణించే వాటి చుట్టూ, మేధోశక్తులకు పరిమితులను విధించడం, ఆ పరిమితుల వెలుపల చర్చలను నిషేధించడం కృత్రిమమైనది.ఉదాహరణకు, వాతావరణ మార్పులకు సంబంధించిన సైన్స్‌ పరిశోధనలు, సహజంగానే, సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలతోపాటు, వలసవాదం, చారిత్రక బాధ్యతల గురించి కూడా చర్చిస్తుంది. ఇది క్రమంగా అసమానత, న్యాయం గురించిన విస్త్రతమైన ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ సమస్యలు విషయానికి సంబంధించిన ఉపరితల అంశం కాదు. కానీ ఎలాంటి శాస్త్రీయ ప్రశ్నలపై దృష్టి కేంద్రీకరించాలో, నిర్ణయించడంలో సహాయ పడతాయి. మరొక ఉదాహరణ, ఇంధన విధానంపై పరిశోధన, పర్యావరణ ఆందోళనలు, లేదా శక్తి వినియోగపు సమాన పంపిణీ గురించిన ప్రశ్నల నుండి వేరు చేయబడదు. ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు ఊపందుకున్నాయి. అనేక నైతికపరమైన సందిగ్ధతలకు అవి దారితీస్తున్నాయి.
పరిణామ భౌతిక శాస్త్రం(క్వాంటం ఫిజిక్స్‌) లాంటి వైజ్ఞానిక రంగాలు, సమకాలీన అంశాలను నుండి మరింత దూరం చేయబడ్డాయి. కానీ, ఈ రంగాలలో పరిశోధనలకోసం ఉదారంగా ప్రజా మద్దతు తోపాటు, నేషనల్‌ క్వాంటం మిషన్‌ ఈ మధ్యకాలంలో జోక్యం చేసుకొని, 6వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమకూర్చింది. ఈ పరిశోధన ప్రత్యక్షంగా ప్రజా ప్రయోజనాలకు, ఉపయోగపడుతుందనే గొప్ప అంచనాలతో ఈ ఆలోచన పుట్టింది. అయితే, శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి, దానికదే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడదు. శాస్త్రసాంకేతిక అభివృద్ధి కూడా, అణచివేతను సులభతరం చేయవచ్చు లేదా అసమానతలు పాతుకొని పోయేటట్లు చేయవచ్చు. కాబట్టి, సైన్స్‌ ఏవిధంగా అమలు జరపబడుతుందనే నిర్ణయాలలో, శాస్త్రజ్ఞులు తమను తాము భాగస్వాములను చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా, ఈ రంగం మొత్తాన్ని పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి వదలివేయకూడదు. అందువల్ల శాస్త్రీయ పరిశోధనలలో విశాలమైన రాజకీయ, చారిత్రక దృక్పధం, స్వఛ్చమైన శాస్త్రంలో కూడా సహాయ పడుతుంది.
సామాజిక అంశాలపై నిమగమై, స్పందించే గొప్ప సాంప్రదాయంతో కూడిన శాస్త్రవేత్తలు కలిగిన భారతదేశం మనది. భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్‌ సాహా, గణిత శాస్త్రజ్ఞుడు డి.డి కోసాంబి, రసాయన శాస్త్రవేత్త అమూల్యారెడ్డి లాంటి ప్రముఖ వ్యక్తులే కాక, ఈ సాంప్రదాయం ప్రజాసైన్స్‌ ఉద్యమాలలో కూడా ఇమిడి ఉంది. ”సామాజిక విప్లవానికి సైన్స్‌” అనే నినాదంతో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌, ఆ రాష్ట్రంలో శాస్త్రీయ విలువలను విస్తృతంగా వ్యాప్తి చేసింది.సైన్స్‌ ప్రయివేటు వారి ప్రయోజనాలకు కాక, సామాజిక ప్రయోజనాలకు వినియోగించ బడాలని ”అఖిల భారత ప్రజా సైన్స్‌ ఉద్యమం” నిరంతరం ప్రచారం చేస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే, వ్యక్తిగత శాస్త్రవేత్తలకు సంకుచిత శాస్త్రీయ అంశాలపై దృష్టి పెట్టడమే సాధ్యమవుతుంది. వారు ప్రధానమైన అంశాలను విస్మరిస్తారు. నా వాదన ఏమంటే, శాస్త్రీయ అంశాలు తరచుగా విస్తృత రాజకీయ అంశాలకు సంబంధించినవి. కాబట్టి ఈ చర్చల్లో శాస్త్రవేత్తలు పాల్గొనడం వల్ల సమాజం ఎంతో ప్రయోజనం పొందుతుంది.
ఈ వాస్తవాల దృష్ట్యా, శాస్త్రీయ సంస్థల నిర్వాహకులు కొందరు, తమ శాస్త్రీయ సంస్థలలో రాజకీయ చర్చలు నిర్వహించ బడినప్పుడు, ఎందుకు అసౌకర్యంగా ఉన్నారు? దీనికి కారణం తెలుసుకోవడం అంత కష్టమైనదేమీ కాదు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకమైన, అభిప్రాయాలను ప్రచారం చేయడం వల్ల, దాని ఆగ్రహానికి గురవుతామని, నిర్వాహకులు తరచూ ఆందోళన చెందుతున్నారు. తరచుగా వారు, ప్రభుత్వం నుండి సూచనల కోసం కూడా వేచి చూడకుండానే, వివాదాస్పదంగా భావించే చర్చలను ముందుగానే సెన్సార్‌ చేస్తున్నారు. ఇలాంటి వైఖరి ప్రస్తుత ప్రభుత్వం కంటే ముందే ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ సెన్సార్‌ షిప్‌ స్థాయికి అనుగుణంగా, ఒత్తిడి మరింత పెరిగిందనేది రహస్యమేమీ కాదు.
కొన్ని సందర్భాలలో, ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ మొహాలీ, నిర్వాహకులు, ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని నిషేధించే సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నారు. అయితే ఈ నియమాలు, నిబంధనలు, ప్రభుత్వాధికార యంత్రాంగం కోసం రూపొందించ బడ్డాయి. ఇవి విద్యా శాస్త్రవేత్తలకు వర్తించవు. 2015లో అలహాబాద్‌ హైకోర్టు సీసీఎస్‌ నియమాలు, సెంట్రల్‌ యూనివర్సిటీకి వర్తించవని పేర్కొన్నది. అదేవిధంగా, త్రిపుర హైకోర్టు నిబంధనలను అమలు చేసినప్పటికీ, ప్రజల ప్రాథమిక హక్కైన, వాక్‌ స్వాతంత్రపు హక్కు నుండి దూరం చేయలేమని తెలిపింది. ఈ సెన్సార్‌ షిప్‌ను దృఢంగా ప్రతిఘటించక పోయినట్లయితే, శాస్త్రీయ సంస్థలలో విద్యాపరమైన స్వేచ్ఛ మరింత దాడికి గురయ్యే అవకాశం ఉంది. అధికారం యొక్క ఏకపక్ష నిర్ణయాలను సవాలు చేయడమే సైన్స్‌కు సంబంధించిన కీలకమైన విలువగా ఉంటుంది. తాము పని చేస్తున్న సంస్థలలో ఈ విలువలను ఆచరణలో పెట్టడమే భారతీయ వైజ్ఞానిక సంఘ సభ్యుల కీలకమైన కర్తవ్యంగా ఉంటుంది.
– అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు
సువ్రత్‌ రాజు