నాకిప్పుడొక గుండె తోడు కావాలి
లేకుంటే ఆ గుండె శబ్దించే లయాత్మక ధ్వని ఆగిపోతుందేమోననెలా
సగం మోదం
అర్థం ఖేదం
ఆనందం పంచే అమత హదయం
విషాదం మింగించే హాలహలం
ఈ ద్వయం నిరంతరం
నా మస్తిష్కంలో జొరబడి
తెగ అల్లకల్లోలం చేస్తున్నాయి
అంతర్వాహినిలో అసమాన
నిరుపమాన ప్రేమ కెరటాలు
ఒక్కోసారి శాంతంగా
ఇంకోసారి అవిశ్రాంతంగా
సందడి చేస్తూ అలజడి సష్టిస్తూ
ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి
ఉన్నట్టుండి ఆకాశంలో విహారం
అధాటున అవనిపై పడదోయటం
ఇప్పుడు నా జీవనగమనంలో
ఎన్నెన్నో తీయని రాతిరి కలలు
మరెన్నో కరకు రాతి దెబ్బలు
అప్పుడప్పుడూ
నా గుండె గిన్నెలో కాసిన్ని
తేనెల మాటల ఊటలు జార్చినట్టే జార్చి
ఆ గిన్నెకు సూక్ష్మపు బెజ్జాలు పెట్టి
ఆ తావిని ఒలకబోస్తూ
అంటే మనసుకు సుగంధం పూసినట్టే పూస్తూ
తటాలున తిరస్కారపు సమ్మెతో కొట్టినట్టుగా
అందుకే… కనుకనే
నా గుండెకిప్పుడు
స్వాంతన కూర్చే లేపనం పూసే
ప్రేమ ధన్వంతరి కావాలి
ఈ నా హదయంపై శాంతిగొల్పే
కమ్మని పలుకుల వాన కురవాలి
వదులైన తీగను సవరించి
శతిలో పలికించే అనురాగ వీణ కావాలి.
– నాగముని. యం (నాగ్)
9490856185