ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ముఖ్యం

– హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కల్చరల్
నవతెలంగాణ-హైదరాబాద్‌: పత్రికా స్వేచ్ఛ   ప్రజాస్వామ్యం కు ముఖ్యమని  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ  ప్రారంభోత్సవ సభ రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తతరే మాట్లాడుతూ.. పాత్రికేయ రంగం ఎంతో పవిత్రమైందని ప్రజాస్వామ్యంలో  మూల స్తంభం అని అన్నారు. ప్రజాస్వామ్యం సరైన దిశలో నడవాలంటే పాత్రికేయ రంగం ముఖ్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రపంచ దేశాల జి20 వరకు పాత్రికేయుల పాత్ర కీలక మన్నారు. నేటి సమాజంలో పరిశోదాత్మకమైన జర్నలిజం ఎంతో అవసరమన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో చాలా యాజమాన్యాలు యాజమాన్యాలు వారి భావాలను ప్రజల భావాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ దశ ఉద్యమంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.  నవభారత్ నిర్మాణం కోసం పాత్రికేయులు పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విభిన్న కోణంలో పనిచేస్తున్న పాత్రికేయులను గుర్తించాలన్నారు. ఉద్యమాలు బలోపేతం కావడానికి ప్రజల సానుభూతిని కూడాకట్టడానికి పాత్రికేయులు చేస్తున్న కృషి వెలకట్టనేలేదన్నారు. పాత్రికేయులను సన్మానించుకుంటే ప్రజాస్వామ్యాన్ని సన్మానించినట్లేనని పేర్కొన్నారు.  అనంతరం జర్నలిస్టులకు పాత్రికేయ సాహితీ సమాగమం  జాతీయ పురస్కారాలను పురస్కారాలు అందజేశారు.  బి ఎం ఎస్ తెలంగాణ అధ్యక్షుడు రవీంద్ర రాజు వర్మ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. భాస్కర యోగి,   డబ్ల్యూజేఐ రాష్ట్ర కన్వీనర్  రాణా ప్రతాప్,  జనంగొంతు ఎడిటర్ అనిల్ రావు, బిటివి సీఈవో మురహరి పాల్గొన్నారు.