ఫ్రెష్‌ లవ్‌స్టోరీ

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించిన మూవీ ‘బేబీ’. ‘కలర్‌ ఫొటో’ సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విరాజ్‌ అశ్విన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా విరాజ్‌. తొలిసారి నా రియల్‌ నేమ్‌ క్యారెక్టర్‌ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్‌, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. రియల్‌ వరల్డ్‌తో కనెక్ట్‌ అయినట్లు బిహేవ్‌ చేస్తుంటాయి. నేను కాలేజ్‌ స్టూడెంట్‌గా నటించాను. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ఒక బ్యాక్‌ స్టోరీ ఉంటుంది. మా సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి.
బాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ కొత్త టోన్‌ ఇచ్చింది. విజువల్‌గా బ్యూటీ ఉంటుంది. అలాగే విజరు బుల్గానిన్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాకు విప్లవ్‌ ఎడిటింగ్‌ కూడా క్రిస్పీనెస్‌ తెచ్చింది. ఆనంద్‌, వైష్ణవి బాగా నటించారు.
నేను చూసిన లవ్‌ స్టోరీస్‌తో పోల్చితే ఇదొక ఫ్రెష్‌ అప్రోచ్డ్‌ ప్రేమకథ. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అయినా రొటీన్‌గా ఉండదు. నిర్మాత ఎస్‌కెఎన్‌ పర్పెక్ట్‌ ప్రొడ్యూసర్‌.
ప్రస్తుతం ‘మరీచిక’ అనే మూవీ చేస్తున్నాను’ అని చెప్పారు.