నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
మండలపరిధిలోని గోపాలపురం గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి పోషణబోయిన హుస్సేన్ డిమాండ్ చేశారు.మంగళవారం 9,10వ వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు, మూడు నెలలుగా బండమీద కాలనీలో వాటర్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడతున్నామని తెలిపారు.అనేకసార్లు గ్రామసర్పంచ్‌కి, గ్రామపంచాయతీ సెక్రెటరీకి తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.ఆ వార్డులో వాటర్ సౌకర్యం లేక ప్రజలు నానాఇబ్బందులు పడతున్నారని తెలిపారు.వాటర్ కోసం అర కిలోమీటర్ దూరం వెళ్లాల్సిన పరిస్థితి దాపరిచిందని తెలిపారు.కనీసం బట్టలు ఉతకడానికి కూడా అరకిలోమీటర్ నుండి వాటర్‌ను తెచ్చుకుంటామని వాపోయారు.వృద్ధులు పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం మినరల్‌వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నాగమణి, మరియమ్మ, కుసుమ, సుదారాణి, సరిత, పుల్లమ్మ, బేబీ, వరమ్మ, సైదమ్మ, రేణుక, చిన్న అంజమ్మ, పెద్దఅంజమ్మ, నాగమణి, పాపమ్మ, సీపీఐ(ఎం) కార్యదర్శి సిద్దిల వెంకటయ్య, నాయకులు కాలవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.