మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నిలిచిన మంచినీటి సరఫరా..

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో కేశవపట్నం ప్రధాన రహదారి వెంట గ్రామానికి మంచినీటిని ఎస్సీ బీసీ క్వార్టర్స్ సమీపంలో అందించే పైప్ లైన్ తెగిపోయి నాలుగు రోజులుగా మంచినీరు వృధాగా పోతూ పక్కనున్న వ్యవసాయ పొలాలు పారుతున్నాయని గ్రామస్తులు గురువారం తెలిపారు. నిత్యం నీటి సరఫరా  అందించే ఈ పైపులైను తెగిపోయి సరఫరా నిలిచిపోయినా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని పర్యవేక్షణ లోపమా?అధికారుల నిర్లక్ష్యమా?కళ్లకు కట్టినట్టుగా రహదారి పక్కనే సాక్షాత్కరిస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రామపంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేపట్టి, నీటి సరఫరాను అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.