నవతెలంగాణ-ఖానాపూర్
పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు. విద్య బోధన చేస్తున్న గురువులను గౌరవించాలని, మంచి మార్గంలో నడవాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్, నాయకులు పరిమి సురేష్, అమనుల్లాఖాన్, షబ్బీర్ పాషా, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మండల అధ్యక్షులు దోనికేని దయానంద్, పిఎసిఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, అమంద శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.